​అమెరికాలో తెలుగు పీఠం (బర్ క్లీ, కాలిఫోర్నియా): ​వదాన్యులకి అభివందనాలు

​అమెరికాలో తెలుగు పీఠం (బర్ క్లీ, కాలిఫోర్నియా): ​వదాన్యులకి అభివందనాలు

03-02-2018

​అమెరికాలో తెలుగు పీఠం (బర్ క్లీ, కాలిఫోర్నియా): ​వదాన్యులకి అభివందనాలు

గత డిశంబర్, 2017 లో మేము చేసిన అభ్యర్ధనని మన్నించి కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం (బర్ క్లీ నగరం) లో ఉన్న తెలుగు పీఠం మరింత బలపడడానికి సత్వరంగా స్పందించి సహృదయంతో విరాళాలు పంపించిన ఈ క్రింది వదాన్యులకి మా అభివందనాలు. వారి తెలుగు భాషాభిమానానికి అభివాదాలు. ఈ క్రింది పట్టికలో తప్పులు దొర్లినా, ఎవరి పేరు అయినా మర్చిపోయినా నన్ను మన్నించండి.

తేళ్ళ కోటేశ్వర రావు (Fort Smith, AR)
రామకృష్ణ & శ్యామలా దేవి దశిక (North Brunswick, NJ)
జె.వి.బి. భాస్కర రావు (Folsom, CA)
శివకుమార్ వావిలాల
రామ & శ్యామల ఏలేశ్వరపు (East Brunswick, NJ)
హరి & సవిత మద్దూరి (Austin, TX)
ప్రభు & వసంత నారుమంచి (Houston, TX)
అనంతనేని ప్రకాశ రావు (Richmond, TX)
చిలుకూరి N. సత్యదేవ్ & శారద (Houston, TX)
చెరుకూరి రామారావు & రమా దేవి (W. Bloom Filed, MI)
తిరువోయిపాటి నందకుమార్ (Redding, CA)
తురగా చంద్రశేఖర్ & అన్నపూర్ణ (Hyderabad, India)
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా (Houston, TX)

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా ద్వారా సేకరించిన మొత్తం విరాళం $14,070 కొద్ది రోజుల క్రితం ఆ విశ్వ విద్యాలయం నిబంధనల ప్రకారం University of California, Berkeley Foundation for Telugu Studies అనే పేరిట వారికి అందజేయబడింది.

ఆ విశ్వవిద్యాలయం లో దక్షిణ ఆసియా విభాగం (తెలుగు శాఖ) దాతలకి ధన్యవాదాలు తెలుపుతూ లేఖలు వ్రాశారు. అలాగే వారి నిబంధనల ప్రకారం $5,000 పైగా విరాళం ఇచ్చిన వారి పేర్లు వారి వెబ్ సైట్ లో ప్రకటించారు. ఆ వెబ్ పేజీ ఇక్కడ జతపరుస్తున్నాను.

పైన పేర్కొన్న వారే కాక, పదేళ్ళగా అటు వేమూరి వెంకటేశ్వర రావు గారు, గత రెండు, మూడు నెలలగా మేమూ, తదితరులూ బెర్క్ లీ లో తెలుగు శాఖ పటిష్టం చేసే ఆవశ్యకత వివరిస్తూ చేసిన అభ్యర్ధనలకి స్పందించి మరి కొందరు మాకే కాక వదాన్యులు వేమూరి గారికీ, తిన్నగా విశ్వ విద్యాలయం వారికీ విరాళాలు అందజేశారు. మాకు అందిన సమాచారం ప్రకారం అలా జమ అయిన విరాళాలు సుమారు $25,000. అనగా, గత రెండు, మూడు నెలలో సేకరించబడిన విరాళాల మొత్తం సుమారు $40,000.

ఈ మొత్తంతో కలిపి బెర్క్ లీ లో తెలుగు పీఠం శాశ్వత నిధికి నిర్దేశించుకుని మీతో పంచుకున్న $500,000 స్థాయికి చేరుకో గలిగాం అనే అనుకుంటున్నాం. కచ్చితంగా ఎంత సొమ్ము సమకూరిందో త్వరలోనే అధికారికంగా తెలుస్తుంది. ఈ ముఖ్యమైన, ఆసక్తికరమైన విషయం మీతో పంచుకోడానికి చాలా సంతోషంగా ఉంది.

మా లక్ష్య సాధనకి ప్రధాన కారకులైన దాతలకి మా పాదాభివందనాలు. వారి తెలుగు భాషాభిమానానికి జోహార్లు.  

ఏ ఒక్క ధనిక కుటుంబ​మో​ కాకుండా అనేక అమెరికా తెలుగు కుటుంబాలు కలిసి చిన్న చిన్న విరాళాలతో వేమూరి వెంకటేశ్వర రావు గారికి అండదండలుగా నిలిచి కలకాలం నిలిచేలా నిలబెట్టిన ఈ తెలుగు పీఠం ప్రతీ ఏటా మరింత పటిష్టం కావాలనీ, దానికి వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి సహకారం, కృషి లోపం ఉండదు అనీ మనవి చేసుకుంటూ....మీ సహాయ, సహకారాలు  మున్ముందు కూడా అందుతాయి అనే ప్రగాఢ నమ్మకంతో ...మరొక్క సారి దాతలకి ధన్యవాదాలతో...

భవదీయుడు,  

వంగూరి చిట్టెన్ రాజు
ఫోన్: 832 594 9054