ఇరు దేశాల సంబంధాలకు ఆకాశమే హద్దు

ఇరు దేశాల సంబంధాలకు ఆకాశమే హద్దు

02-02-2018

ఇరు దేశాల సంబంధాలకు ఆకాశమే హద్దు

భారత్‌తో అమెరికా సంబంధాలు బాగా పెరుగుతుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా ఇష్టపడుతున్నారని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ సృష్టం చేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఆకాశమే హద్దు అని ఆమె వ్యాఖ్యానించారు. భారత్‌లో తీసుకొస్తున్న శక్తిమంతమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణల పట్ల ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సింగ్‌ సర్నా తన నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ఆమె పాల్గొన్నారు. కొందరు ప్రముఖ భారతీయ అమెరికన్లతో జరిగి ఈ విందు సమావేశంలో హేలీ భారత్‌తో సత్సంబంధాలు గురించి మాట్లాడారు. ఇరు ప్రజాస్వామ్య దేశాలకు చాలా విషయాల్లో ఒకేరకమైన విలువలున్నాయని, ఇవి రెండు దేశాలు కలిసి పనిచేయడానికి సహకరిస్తుందన్నారు.