లాటరీ వీసాలకు స్వస్తి : ట్రంప్

లాటరీ వీసాలకు స్వస్తి : ట్రంప్

02-02-2018

లాటరీ వీసాలకు స్వస్తి : ట్రంప్

లాటరీ తీయడం ద్వారా వీసాలను ఇస్తున్న విధానానికి స్వస్తి చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. వలస చట్టాలను సంస్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తెచ్చేందుకు పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. తొలిసారిగా కాంగ్రెస్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్‌ తనపై ఉన్న దురభిప్రాయాలను తొలగించే ప్రయత్నం చేశారు. తనతో కలసి పని చేసి అమెరికా పౌరుల ప్రయోజనాలను కాపాడాలని డెమోక్రాట్లకు పిలుపు ఇచ్చిన ట్రంప్‌ నాలుగు ప్రధాన సంస్కరణలను ప్రతిపాదించారు. ఎటువంటి పత్రాలూ లేకుండా అమెరికాలో కాలుపెట్టిన 18 లక్షల మంది డ్రీమర్లకు పౌరసత్వం ఇచ్చేందుకు కృషి చేస్తామని, మెక్సికో సరిహద్దులో గోడ సహా సరిహద్దు భద్రత, లాటరీ ద్వారా వీసాల జారీకి ముగింపు కుటుంబ సమేతంగా వలసలను నివారించడం కోసం కలసి పని చేద్దామని ఆయన కోరారు. రెండు పార్టీల సభ్యులతో కలిసి నడిచేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.