భారత సంతతి ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారాపై ట్రంప్ పాలకవర్గం వేటు
APEDB

భారత సంతతి ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారాపై ట్రంప్ పాలకవర్గం వేటు

13-03-2017

భారత సంతతి ప్రాసిక్యూటర్ ప్రీత్ భరారాపై ట్రంప్ పాలకవర్గం వేటు

ఏడు ముస్లిం దేశాలపై విధించిన నిషేధం ఉత్తర్వులు కోర్టు ముందు నిలవకపోవడానికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లే కారణమని భావించిన ట్రంప్‌ ప్రభుత్వం 46 మంది పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు రాజీనామా చేయాలని ఆదేశించింది.  అందుకు తిరస్కరించిన భారత సంతతికి చెందిన ప్రీత్‌ భరారా(48)ను పదవి నుంచి తొలగించింది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన హై ప్రొఫైల్‌ ఫెడరల్‌ ప్రాసిక్యూటర్లలలో ఒకరిగా ప్రీత్‌ భరారాకు పేరుంది. నేను రాజీనామా చేయలేదు. కొద్దిసేపటి క్రితమే నన్ను తొలగించారని ఆయన చెప్పారు.  ఫెడరల్‌ అటార్నీగా ఏడేళ్లు పనిచేయడం నా వృత్తి జీవితానికి లభించిన అరుదైన గౌరవంగా భావిస్తానని చెప్పారు. గతంలో నేను ఏం చేశానో పట్టించుకోను. ఇక ఎన్ని రోజుల జీవించినా సరే అని పేర్కొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యమున్న కేసుల్లో ప్రభుత్వం తరపున వాదించారు. విదేశాల్లోనూ విచారణలు కొనసాగించారు. అమెరికా రాజకీయవేత్తలు సంబంధమున్న ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ కేసును చేపట్టారు. ఈ కేసులో గోల్డ్‌మెన్‌ సాక్స్‌ మాజీ డైరెక్టర్‌, భారత సంతతికి చెందిన రజత గుప్తా దోషిగా తేలారు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించగానే గత ఏడాది నవంబర్‌లోనే ఒబామా హయాంలో నియమితులైన అటార్నీలు అందరూ  రాజీనామా చేయాలని ఆదేశించారు. అయితే ఆ ఖాళీలను భర్తీ చేసేవరకూ ఆ పదవుల్ల కొనసాగవచ్చునని పేర్కొన్నారు. ఆ వెంటనే ట్రంప్‌ను కలిసి భరారా  తనను పదవిలో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ట్రంప్‌ కూడా అంగీకరించారు. ఈ నేపథ్యంలో తన పదవికి భరారా రాజీనామా చేయలేదు. ఏమైందో తెలియదుకానీ భరారాతోపాటు మరో 45  మందిని తొలగిస్తున్నట్లు ట్రంప్‌ యంత్రాంగం ఉత్వర్వులు జారీ చేసింది. ఇలా రాజీనామాలు చేయాలని ఆదేశించడం కొత్తేమి కాదని, గతంలో జార్జి బుష్‌, బిల్‌ క్లింటన్‌ హయాంలోనూ ఇలాగే ఆదేశించారని ఉదహరిస్తోంది. భరారా తొలగింపుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయాన్ని సౌత్‌ ఏసియన్‌ బార్‌ అసోసియేషన్‌ ఖండించింది.