ఫ్లోరిడాలో ఎన్నారై స్టోర్ పై విద్వేష దాడి....

ఫ్లోరిడాలో ఎన్నారై స్టోర్ పై విద్వేష దాడి....

13-03-2017

ఫ్లోరిడాలో ఎన్నారై స్టోర్ పై విద్వేష దాడి....

అమెరికాలో ఎన్నారైకి చెందిన దుకాణంపై విద్వేషపూరిత దాడి జరిగింది. ఫ్లోరిడాలో 64ఏళ్ల  లాయిడ్‌ అనే వ్యక్తి భారత సంతతికి చెందిన అమెరికన్లు నడిపే దుకాణాన్ని తగులబెట్టేందుకు శుక్రవారం యత్నించాడు. ముస్లిముల కు చెందినది కాబట్టే తానీ ప్రయత్నం చేశానని, ఆరబ్బులు అమెరికా విడిచి వెళ్లాలని కోరుకుంటున్నట్లు నిందితుడు చెప్పారు. అందులో భాగంగానే దుకాణం ముందు వ్యర్థాలను పోగుచేసి వాటిని తగులబెట్టాడు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే, లాయిడ్‌ భావించినట్టుగా దుకాణ యజమానులు అరబ్బులుకారని, వారు భారత సంతతికి చెందినవారిని పోలీసులు తెలిపారు. దుకాణం తగలబెట్టేందుకు యత్నించిన నేరంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.