అమెరికాలో విజయోత్సవాలు

అమెరికాలో విజయోత్సవాలు

13-03-2017

అమెరికాలో విజయోత్సవాలు

ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌  అసెంబ్లీ  ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘనవిజయాన్ని పురస్కరించుకుని అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. సిలికాన్‌వ్యాలీ నుంచి న్యూయార్క్‌ దాకా, వాష్టింగ్టన్‌ డీసీ తదితర ప్రాంతాల్లోని భారత సంతతి అమెరికన్లు భారీ సంబరాల్లో మునిగితేలారు. ప్రధాని నరేంద్రమోడీ అభివృద్ధి మంత్రమే ఈ ఎన్నికల్లో ఘనవిజయానికి కారణమంటూ హర్షం వ్యక్తం చేశారు. సిలికాన్‌ వ్యాలీలో భారత సంతతి అమెరికన్లు పెద్దసంఖ్యలో టీవీల ముందుచేరి ఎన్నికల ఫలితాలను ఉత్కంఠతో వీక్షించారు.