కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

12-01-2018

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

తుపాకీ కాల్పుల చప్పుళ్లు కాలిఫోర్నియా యూనివర్సిటీలో కలకలాన్ని రేపాయి. గుర్తుతెలియని వ్యక్తి కళాశాల ప్రాంగణంలోకి ప్రవేశించి తుపాకీతో వీరంగం చేశాడు. ఈ ఘటనతో కాలేజీని తాత్కాలికంగా మూసివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నేరస్తుడి కోసం గాలిస్తున్నారు. అయితే, ఆ సంఘటనలో ఎవరు గాయపడలేదని ఉన్నతాధికారులు వెల్లడించారు. లాస్‌ఏంజెల్స్‌కు 100 కిలోమీటర్ల దూరంలోని బెర్నార్డినొలో ఈ కాలేజీ ఉంది. పార్కింగ్‌ ఆర్ట్స్‌ బిల్డింగ్‌ వద్ద అగంతకుడు కాల్పులకు పాల్పడినట్లు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పేర్కొంది.