ఉత్తర కొరియాతో చర్చలకు తాను సిద్ధమని, అయితే సరైన సమయంలో, సానుకూల పరిస్థితుల్లోనే ఆ దేశంతో మాట్లాడుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో జరిపిన ఫోన్ సంభాషణలో వెల్లడించారు. ఫోన్ సంభాషణ వివరాలను వైట్‌హౌస్ మీడియాకు విడుదల చేసింది. మూన్ జే ఇన్‌తో ఫోన్లో మాట్లాడనని, ఉత్తర కొరియాతో జరుగుతున్న చర్చల వివరాలను ఆయన తనతో చెప్పారని, వారి చర్చలు ఎటువంటి ఫలితాలనిస్తాయో చూడాలని ఆ తరువాత ట్రంప్ మీడియాతో చెప్పారు.