భారత్‌, రష్యా, చైనాలతో పనిచేయడం తమకు ప్రయోజనమే

భారత్‌, రష్యా, చైనాలతో పనిచేయడం తమకు ప్రయోజనమే

11-01-2018

భారత్‌, రష్యా, చైనాలతో పనిచేయడం తమకు ప్రయోజనమే

భారత్‌తో అమెరికా మధ్య సత్సంబంధాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. భారత్‌, రష్యా, చైనా లాంటి దేశాలతో కలిసి పనిచేయడం చెడు కాదు మంచి విషయమేనని అన్నారు. రష్యాతో సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవాలని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ ప్రకటించారు. ఇటీవల అమెరికా, రష్యాల మధ్య వివాదాలు చోటుచేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన ఈ విదంగా స్పందించారు. భారత్‌, రష్యా, చైనా లాంటి దేశాలతో కలిసి పనిచేయడం మంచి విషయమే. అందులో ఎలాంటి చెడు లేదు అని శ్వేతసౌధంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్‌ అన్నారు. ఆయా దేశాలతో పనిచేయడం తమకు ప్రయోజననమేన్నారు. ఈ సందర్భంగా ఉత్తర కొరియా గురించి మాట్లాడుతూ ఉత్తరకొరియా తమకు సమస్యే కాదు. అది వారి సమస్యేనని అన్నారు. వారే దాన్ని పరిష్కరించుకోవాలని హితవు పలికారు.