ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

11-01-2018

ట్రంప్‌కు మరో ఎదురుదెబ్బ

చట్ట వ్యతిరేకంగా బాల్యంలోనే అమెరికాకు వచ్చి అక్కడే పెరిగి ఉద్యోగావకాశాలు పొందిన యువతను క్రమబద్ధీకరించేందుకు గత ఒబామా సర్కారు అమలు చేసినా డాకా (డిఫర్డ్‌ యాక్షన్‌ ఆన్‌ చైల్డ్‌హుడ్‌ అరైవల్స్‌) చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్‌  ప్రభుత్వం నిర్ణయంపై కాలిఫోర్నియా ఫెడరల్‌ న్యాయమూర్తి స్టే విధించారు. ఈ స్టే దేశవ్యాప్తంగా వర్తిస్తుందని, పాత చట్టాన్ని యధాతథంగా అమలు చేయాలని ఆయన తన ఆదేశాలలో పేర్కొన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలన్న ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ఆక్రమమని న్యాయమూర్తి విలియం అల్సప్‌ తన ఆదేశాలతో పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రభుత్వ నిర్ణయంతో దెబ్బతినే దాదాపు 8 లక్షల మందికి పైగా వలసదారులకు సాంత్వన చేకూర్చే అంశంపై అధికార రిపబ్లికన్‌, డెమోక్రాట్స్‌ సభ్యుల మధ్య తీవ్ర స్థాయి చర్చ జరిగింది.