ప్రతిభ ఆధారంగానే ప్రవేశం

ప్రతిభ ఆధారంగానే ప్రవేశం

11-01-2018

ప్రతిభ ఆధారంగానే ప్రవేశం

అమెరికాలోకి అక్రమ వలసలను నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. అమెరికాకు రావాలనుకుంటున్న వలసదారులకు ప్రతిభ ఆధారంగానే ప్రవేశం ఉంటుందని తెలిపారు. అమెరికాలో ఉంటున్న ప్రవాసీయులు కుటుంబ సభ్యులను చాలా సులభంగా ఇక్కడి తీసుకొస్తున్నారని, దీనికి అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు. ట్రంప్‌ అధికార నివాసం వైట్‌హౌస్‌లో చట్టసభ సభ్యులతో ఆయన మాట్లాడుతూ మెక్సికో సరిహద్దు వెంట కూడా అక్రమ వలసలు పెరుగుతున్నాయని గుర్తు చేశారు. వీసాల మంజూరుకు ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ విధానానికి కూడా చమరగీతం పాడాలని సూచించారు.