దావోస్‌ లో భేటీకానున్న ట్రంప్‌, మోదీ!

దావోస్‌ లో భేటీకానున్న ట్రంప్‌, మోదీ!

10-01-2018

దావోస్‌ లో భేటీకానున్న ట్రంప్‌, మోదీ!

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెలాఖరులో భేటీ అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. జనవరి చివరి వారంలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎనకమిన్‌ ఫోరమ్‌ జరగనుంది. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రముఖ నేతలు, ఆర్థిక వేత్తలు హాజరవుతారు. అమెరికా నుంచి ట్రంప, భారత్‌  నుంచి మోదీ కూడా ఈ సదస్సులో పాల్గొననున్నారు. సమావేశాల్లో భాగంగా వీరు ఇరువురు భేటీ అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ సదస్సుకు  గత 18 ఏళ్లలో అమెరికా అధ్యక్షుడు హాజరుకాలేదు. ఈ సారి ట్రంప్‌ ఆ మీటింగ్‌కు వెళ్లి కొత్త రికార్డును క్రియేట్‌ చేయనున్నారు. ప్రపంచ దేశాధినేతలతో అమెరికా ఫస్ట్‌ అన్న తన ఎజెండాను ట్రంప్‌ ముందుకు తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌తోనూ ట్రంప్‌ ద్వైపాక్షిక చర్చలు నిర్వహించే అవకాశాలున్నాయి. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కూడా భారత ప్రధాని మొదటిసారి వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌కు హాజరుకానున్నారు. 1997లో అప్పటి ప్రధాని దేవగౌడ్‌ ఈ సదస్సుకు వెళ్లారు. ఈ సారి మొత్తం వంద మంది ప్రతినిధులు మోదీ టీమ్‌ దావోస్‌కు వెళ్తుంది. జనవరి 23న సదస్సు జరగనున్నది. ఆ రోజున ప్రధాని మోదీ సమావేశంలో కీలక ప్రసంగం చేయనున్నారు. కొందరు కేంద్ర మంత్రులు కూడా ఈ ఈవెంట్‌కు హాజరుకానున్నారు.