పాల‌స్తీన‌కు డొనాల్డ్‌ ట్రంప్ వార్నింగ్‌…!

పాల‌స్తీన‌కు డొనాల్డ్‌ ట్రంప్ వార్నింగ్‌…!

03-01-2018

పాల‌స్తీన‌కు డొనాల్డ్‌ ట్రంప్ వార్నింగ్‌…!

పాకిస్థాన్‌కు సైనిక సాయం నిలివేసిన అమెరికా అదే విధంగా పాలస్తీనాకు కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పాక్‌ సరైన చర్యలు తీసుకోవడంలేదని అమెరికా, పాక్‌కు 255 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని నిలివేసిన సంగతి తెలిసిందే. శాంతి చర్చలకు అంగీకరించకపతే పాలస్తీనాకు కూడా సాయం నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్‌లో వెల్లడించారు. పాలస్తీనాకు సాయం చేయడం వల్ల అమెరికాకు ఎలాంటి ప్రశంస గానీ, గౌరవం గానీ దక్కట్లేదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ రాజధానిగా జెరుసలేంను గుర్తించే అంశంపై ఇబ్బంది ఎదురవుతున్న నేపథ్యంలో ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనా కోసం ఏటా వందల మిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాం. కానీ ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలకు పాలస్తీనా సుముఖత చూపించడం లేదని, ఇక భవిష్యత్తులో మేము ఎందుకు సాయం చేయాలని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు.