నీకన్నా పెద్ద బాంబు నా దగ్గర ఉంది.. జాగ్రత్త!

నీకన్నా పెద్ద బాంబు నా దగ్గర ఉంది.. జాగ్రత్త!

03-01-2018

నీకన్నా పెద్ద బాంబు నా దగ్గర ఉంది.. జాగ్రత్త!

అమెరికా, ఉత్తర అమెరికా అధ్యక్షుల మధ్య మాటల యుద్దం ఇప్పట్లో ముగిసేలా లేదు. ఇద్దరు నేతలూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. నువ్వెంతంటే నువ్వెంత అంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాపై వేయడానికి న్యూక్లియర్‌ బాంబు స్విచ్‌ తన టేబుల్‌పైనే సిద్దంగా ఉంటుదని నార్త్‌ కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. దీనికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దీటుగా సమాధానమిచ్చారు. మీ కన్నా పెద్దది, చాలా శక్తివంతమైన బాంబు నా దగ్గర ఉంది. ఆ స్వీచ్‌ కూడా నా టేబుల్‌పైనే ఉంటుంది. అంతేకాదు అది ఫెయిలయ్యే చాన్సే లేదు అని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. కొత్త సంవత్సరం రోజున జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ అమెరికాకు గట్టి వార్నింగ్‌ ఇచ్చారు కిమ్‌. అమెరికా మొత్తం కవరయ్యేలా ఓ ఇంటర్‌కాంటినెంటల్‌ బాలిస్టిక్‌ మిస్సైల్‌ తమ దగ్గర ఉన్నదని, దానికి సంబంధించిన స్వీచ్‌ తన టేబుల్‌పైనే ఉంటుందని కిమ్‌ అన్నారు.