హెచ్‌ 1బీ వీసా గడువు పొడిగింపు రద్దు

హెచ్‌ 1బీ వీసా గడువు పొడిగింపు రద్దు

03-01-2018

హెచ్‌ 1బీ వీసా గడువు పొడిగింపు రద్దు

కొత్త సంవత్సరం ప్రారంభంలో భారత టెక్కీలకు చేదు వార్త. హెచ్‌1బీ వీసా గడువును పొడిగించటానికి ట్రంప్‌ ప్రభుత్వం నిరాకరించింది. గత ఆరు సంవత్సరాలుగా హెచ్‌1బి వీసాతో అమెరికా లో ఉంటూ దాని గడువు పొడిగింపు కోసం, గ్రీన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వేలాది భారతీయ టెక్కీల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ప్రతీ ఏడాదీ అమెరికా అధికారులు 85వేలకు పైగా హెచ్‌1బీ వీసాల గడువును పొడిగిస్తారు. తద్వారా వేలాది మంది గ్రీన్‌ కార్డుకోసం దరఖాస్తు చేసుకుంటారు. ఇప్పుడు ట్రంప్‌ నిర్ణయంతో వేలాది మంది భారతీయులు వెనక్కి రావాల్సి వస్తుంది.