ముందున్నది అద్భుత కాలం

ముందున్నది అద్భుత కాలం

02-01-2018

ముందున్నది అద్భుత కాలం

అమెరికాకు మందున్నది అద్భుతమైన కాలమని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. బాధ్యతలు చేపట్టి ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వం సాధించిన ఆర్థిక ప్రగతి గురించి ఆయన వివరిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.  పామ్‌ బీచ్‌లో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న ట్రంప్‌ అమెరికాకు సంబంధించి నంతవరకు కొత్త ఏడాది మంచిగా ఆరంభమైందని అన్నారు. ఈ సందర్భంగా పన్నుల్లో కోత బిల్లులోని కొన్ని నిబంధనలను, ఒబామాకేర్‌ను రద్దు చేయడం వంటి వాటిని ఆయన ఉదహరించారు. ఇది తమ ప్రభుత్వం సాధించిన తొలి విజయమని పేర్కొన్నారు. రాబోయే కాలమంతా చాలా బాగుంటుందని, స్టాక్‌ మార్కెట్‌ కూడా లాభాల బాటలో పయనిస్తుందని భావిస్తున్నట్లు ట్రంప్‌ చెప్పారు. అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వస్తూనే వుంటాయని, త్వరలోనే ఈ విషయంలో రికార్డు సాధిస్తామని చెప్పారు.