పాక్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

పాక్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

02-01-2018

పాక్‌కు డొనాల్డ్‌ ట్రంప్‌ షాక్‌

ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తూ బయటకు కపట నాటకాలాడుతున్న పాకిస్తాన్‌ నెత్తిన భారీ పిడుగు పడింది. ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ, పాక్‌ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూ వస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండబోదని ఆయన సృష్టం చేశారు. సాయం కొనసాగిస్తున్నందుకు అమెరికా నేతలను మూర్ఖులనుకుంటున్నారా? అని ఘూటుగా విమర్శించారు.  సాయం రూపంలో అమెరికా నుంచి భారీ మొత్తం అందుతున్నప్పటికీ, పాక్‌ అవాస్తవాలతో తమను మోసం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటివరకు 33 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) సాయం అందిస్తే, ప్రతిగా పాకిస్తాన్‌ మాత్రం ఉగ్రవాద కేంద్రాలకు రక్షణ కల్పిస్తోందని మండిపడ్డారు.