బటన్‌ నొక్కితే అమెరికా ఖతం

బటన్‌ నొక్కితే అమెరికా ఖతం

01-01-2018

బటన్‌ నొక్కితే అమెరికా ఖతం

అణుబాంబుతో దాడి చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నట్లు ఉత్తర కొరియా నేత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ తెలిపారు. అణు దాడికి సంబంధించిన బటన్‌ ఎప్పుడూ తన డెస్క్‌ మీద రెఢీగా ఉంటుందని కిమ్‌ హెచ్చరించారు. ఆ భయం వల్లే అమెరికా తమపై దాడి చేయదని ఉత్తర కొరియా నేత తెలిపారు. న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా కిమ్‌ జాతిని ఉద్దేశించి మాట్లాడారు. అమెరికాలో తమ రేంజ్‌లోనే ఉన్నదని, తమ దగ్గర ఉన్న అణ్యాయుధాలు ఆ దేశాన్ని నాశనం చేయగలవని అన్నారు. ఇది బెదిరింపు కాదు, ఇదే నిజమని తెలిపారు. అయితే పొరుగు దేశం దక్షిణ కొరియాతో మాత్రం కిమ్‌ సఖ్యతను ఆశించారు. సౌత్‌ కొరియాతో తామెప్పుడూ చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సియోల్‌లో జరిగే వింటర్‌ ఒలింపిక్స్‌కు కూడా తమ టీమ్‌ను పంపనున్నట్లు తెలిపారు.