న్యూఇయర్‌ వేడుకలకు కొద్ది నిమిషాల ముందే

న్యూఇయర్‌ వేడుకలకు కొద్ది నిమిషాల ముందే

01-01-2018

న్యూఇయర్‌  వేడుకలకు కొద్ది నిమిషాల ముందే

మరికొద్దిసేపట్లో 2018కి స్వాగతం చెప్పబోతున్నారనగా ఓ 16 ఏళ్ల బాలుడు ఇంట్లో వారిపై కాల్పులు జరిపాడు. దాంతో నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే చనిపోయారు. ఈ ఘటన అమెరికాలోని న్యూజెర్సీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే, లాంగ్‌ బ్రాంచ్‌ స్ట్రీట్‌కి చెందిన ఓ అపార్ట్‌మెంట్‌ అర్థరాత్రి 2 గంటల సమయంలో న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకొంటున్నారు. ఇంతలో ఓ బాలుడు అపార్ట్‌మెంట్‌లోకి చొరబడి ఏకే-47తో కాల్పులు జరిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఉగ్రదాడిలా కన్పించడంలేదని వ్యక్తిగత కక్షతోనేనే కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు పాల్పడిన బాలుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.