ఎక్కా వెంకట్‌కు అంతర్జాతీయ పురస్కారం

ఎక్కా వెంకట్‌కు అంతర్జాతీయ పురస్కారం

01-01-2018

ఎక్కా వెంకట్‌కు అంతర్జాతీయ పురస్కారం

తెలంగాణ అమెరికన్‌ తెలుగు సంఘం (టాటా) సమన్వయకర్త, అమెరికాలో ఫోర్డ్‌ కంపెనీ ఐటీ మేనేజర్‌ ఎక్కా వెంకట్‌కు మున్నురుకాపు అంతర్జాతీయ పురస్కారం లభించింది. మున్నూరుకాపు మాసపత్రిక ఐదో వార్షికోత్సవం, అవార్డుల ప్రదానోత్సవం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. వేడుకలో ముఖ్యఅతిథి శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ మాట్లాడుతూ విదేశాల్లో  స్థిరపడిన తెలుగు ప్రజలు తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను బతికించుకోవడానికి వెంకట్‌ చేస్తున్న ప్రయత్నాలు మనందరికీ ఆదర్శమన్నారు. ఎక్కా వెంకట్‌ మాట్లాడుతూ టాటా ద్వారా విదేశాల్లోనే కాకుండా స్వదేశంలోనూ అద్భుతమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పురస్కార కమిటీ చైర్మన్‌ ఆకుల రవీందర్‌, పుస్తకం సంపాదకుడు కోల జనార్దన్‌  పాల్గొన్నారు.