డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం

01-01-2018

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2017కు వీడ్కోలు పలికి, 2018కి స్వాగతం చెప్పేవేళ, ఆయన మధ్యంతర ఎన్నికలకు సిద్ధమవుతున్నట్టు సంకేతాలు ఇచ్చారు. కొత్త సంవత్సరం వేళ, యూఎస్‌ కాంగ్రెస్‌ ను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. యూఎస్‌ పన్ను వ్యవస్థ, స్టాక్‌ మార్కెట్లు నష్టపోతున్న తీరును ప్రస్తావించిన ఆయన, అమెరికన్లు స్మార్ట్‌ ఓటర్లని, 2018లో వారు డెమోక్రాట్లను ఎందుకు ఎంచుకుంటారని ప్రశ్నించారు. డెమోక్రాట్ల విధానాలు, అమెరికా గొప్ప చరిత్రను, సంస్కృతిని, సంపదను హరించే వేసేలా ఉన్నాయని ఆరోపించారు. ఐఎస్‌ఐఎస్‌, వీఏ, జడ్జస్‌, స్ట్రాంగ్‌ బార్డర్‌, సెకండ్‌ ఏ తదితర పదాలను పలికేందుకు అమెరికాన్లు ఇస్టపడటం లేదని అన్నారు. వీటిల్లో ఆయుధాల నిషేధం దిశగా, రాజ్యాంగ సవరణను సూచించే సెకండ్‌ ఏ పై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఆయన మాటల్లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలన్న ఉద్దేశం సృష్టంగా కనిపిస్తోందని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.