వాషింగ్టన్ లో ఇమిగ్రేషన్ సదస్సు సక్సెస్

వాషింగ్టన్ లో ఇమిగ్రేషన్ సదస్సు సక్సెస్

13-03-2017

వాషింగ్టన్ లో ఇమిగ్రేషన్ సదస్సు సక్సెస్

నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ (నాట్స్‌ ) ఆధ్వర్యంలో వాషింగ్టన్‌ డీసీలో ఇమిగ్రేషన్‌ అవేర్‌నెస్‌ పేరిట అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సోసైటీ, యునైటెడ్‌ స్టేట్స్‌ సిటిజన్‌ షిప్‌,  అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌, వర్జీనియా అటార్నీ జనరల్‌ కార్యాలయంతో కలిసి నాట్స్‌ ఈ ఎవేర్నెస్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.  అమెరికా పౌరసత్వం, ఇమిగ్రేషన్‌ అంశాలపై జరిగిన ఈ అవగాహన కార్యక్రమానికి వందలాది అంతార్జాతీయ విద్యార్థులు హాజరయ్యారు. న్యాయపరంగా మీ  దగ్గర అన్ని ధ్రువపత్రాలు ఉంటే అమెరికాలో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని ఇందులో పాల్గొన్న అధికారులు  గ్లోరియా విలియమ్స్‌, బ్రెవడాండ్‌లు సృష్టం  చేశారు. విద్యార్థుల దగ్గర ఉండాల్సిన ప్రాథమిక సమాచారంపై వారికి అవగాహన కల్పించారు. ఈ వెరిఫికేషన్‌ కు సంబంధించిన  ప్రాథమిక అవగాహనతో పాటు విద్యార్థుల ప్రశ్నలకు అధికారి హ్వారీనాష్‌ సమాధానాలిచ్చారు. యజమాని, ఉద్యోగుల దగ్గర ఉండాల్సి సమాచారాన్ని అందించారు. విద్యార్థులు మరింత వివరణకు తమను సంప్రదించవచ్చని కూడా తెలిపారు. వ్యక్తిగత హక్కుల పరిరక్షణకు సంబంధించిన సమాచారాన్ని కూడా అటార్నీ జనరల్‌ అధికారణి మిస్‌ లిత్‌ మిచేల్‌ అందిస్తామని తెలిపారు. ఎవరైనా తమ గుర్తింపునకు సంబంధించిన  సమాచారాన్ని దొంగిలిస్తే దానిని తిరిగి ఎలా పొందాలనే  దానిపై కూడా తాము సాయం అందిస్తామన్నారు.

నాట్స్‌ డీసీ చాప్టర్‌ కో ఆర్డినేటర్‌ రాధిక గుంటూరు, గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సొసైటీ ప్రెసిడెంట్‌ రావు ఎన్‌ లింగా, నాట్స్‌ యూత్‌ కో ఆర్డినేటర్‌ అవినాష్‌ తలశిల, దినేష్‌ చంద్‌, సంజీవ్‌ న ఆయుడు తదితరులు ఈ అవగాహన సదస్సును విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. యుఎస్‌సిఐఎస్‌ అటార్నీ జనరల్‌ అధికారులతో పాటు ఈ సదస్సు నిర్వహణలో తమ వంతు సాయం అందించిన వారందరికీ నాట్స్‌ బోర్డ్‌ సభ్యులు లక్ష్మి లింగా ధన్యవాదాలు తెలిపారు. వీఐయూ తోపాటు  విద్యార్థిలు విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న విద్యార్థులకు నాట్స్‌  ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. వీఐయూతో  పాటు విద్యార్థి విభాగాలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న విద్యార్థులకు నాట్స్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.