బాటా నూతన సంవత్సర వేడుకలకు నిఖిల్ రాక

బాటా నూతన సంవత్సర వేడుకలకు నిఖిల్ రాక

30-12-2017

బాటా నూతన సంవత్సర వేడుకలకు నిఖిల్ రాక

బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ కిరాక్‌ పేరుతో నిర్వహిస్తున్న నూతన సంవత్సర వేడుకల్లో స్వామి రారా ఫేమ్‌ నిఖిల్‌ పాల్గొంటున్నారు. ఫ్రీమాంట్‌లో డిసెంబర్‌ 31వ తేదీన జరిగే ఈ వేడుకలను బాటాతో కలిసి పీపుల్‌ మీడియా సమర్పిస్తోంది. స్వాగత్‌ రెస్టారెంట్‌, తానా సంస్థలు ఈ కార్యక్రమానికి మద్దతును ఇస్తున్నాయి. సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తోపాటు పలు కార్యక్రమాలను ఇందులో ప్రదర్శిస్తున్నారు. డిజె విష్‌ సందడితోపాటు గేమ్స్‌, ఫ్యాషన్‌ షోలు  వంటివి చూడాలనుకుంటే ఈ కార్యక్రమానికి తరలిరండని నిర్వాహకులు కోరుతున్నారు. ఇతర వివరాలకు ఫ్లయర్‌ చూడండి.