మాతృరాష్ట్రంలో తెలుగు సంఘాల సందడి

మాతృరాష్ట్రంలో తెలుగు సంఘాల సందడి

30-12-2017

మాతృరాష్ట్రంలో తెలుగు సంఘాల సందడి

అమెరికాలో తెలుగు కమ్యూనిటీకి సేవలందిస్తున్న జాతీయ తెలుగు సంఘాలు ప్రతి రెండేళ్ళకోమారు మాతృరాష్ట్రంలోని తెలుగువాళ్ళకు కూడా సేవా కార్యక్రమాల పేరుతో సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా రెండు జాతీయ సంఘాలు తెలంగాణలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ సేవలందించాయి. అమెరికా తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టాటా), ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఈ కార్యక్రమాలను డిసెంబర్‌ నెలలో మాతృరాష్ట్రంలో అందించాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మూడు సంఘాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలు, యువజనోత్సవాలు , సాంస్కతిక మహోత్సవాలు, బిజినెస్‌ సెమినార్‌లు, సేవా సంస్థల సందర్శన, ప్రముఖులతో సమావేశాలు, 5 కె రన్‌, సాంస్కృతిక సమావేశాలతో మాతృరాష్ట్రంలోని ప్రజలను అలరించారు.