టాటా సేవలకు ప్రశంసలు....

టాటా సేవలకు ప్రశంసలు....

30-12-2017

టాటా సేవలకు ప్రశంసలు....

డిసెంబర్‌ 14 నుంచి 23వ తేదీ వరకు సేవా దినోత్సవాలను టాటా నిర్వహించింది. ఈ సందర్భంగా టాటా ఆధ్వర్యంలో తెలంగాణలో పలు చోట్ల విభిన్న కార్యక్రమాలను చేశారు. ప్రెసిడెంట్‌ ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అడ్వయిజర్లుగా డాక్టర్‌ మోహన్‌ పాటలోళ్ళ, భరత్‌రెడ్డి మందాడి వ్యవహరించారు. హైదరాబాద్‌ ప్రాంత కో ఆర్డినేటర్‌గా ద్వారకనాథ్‌రెడ్డి ఉన్నారు. సేవా కార్యక్రమాల కో ఆర్డినేటర్‌గా వంశీ వ్యవహరించారు. సేవాకార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌ జిల్లా హనుమకొండలో నిర్వహించిన వైద్యశిబిరంలో దాదాపు 250 మంది చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిరెడ్డి ఫౌండేషన్‌ సహకారంతో దివ్యాంగ విద్యార్థులకు సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర వికలాంగుల సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డి హాజరయ్యారు.

వరంగల్‌ జిల్లాలోని ఆత్మకూరు గ్రామంలో టాటా బోర్డ్‌ డైరెక్టర్‌ వంశీరెడ్డి స్పాన్సర్‌ చేసిన ఆర్‌వో వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, ముఖ్యఅతిధిగా మంత్రి కడియం శ్రీహరి హాజరయ్యారు. శాయంపేటలో స్కూల్‌ పిల్లలకు బ్యాగ్‌లను పంపిణీ చేశారు. తొర్రూరులో కూడా సేవా కార్యక్రమాలను టాటా నిర్వహించింది.

టాటా సభ్యుడు వెంకట్‌ గడ్డం రమణారెడ్డి స్పాన్సర్‌ చేసిన కార్యక్రమానికి కూడా పలువురు ప్రముఖులుహాజరయ్యారు. చర్లపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే దయాకర్‌ రెడ్డి, మంత్రి కడియం శ్రీహరి తదితరులు హాజరయ్యారు. సోలిపేటలో కూడా టాటా సేవా కార్యక్రమాలను ఘనంగా జరిపారు.

హైదరాబాద్‌లోని సాధన హోమ్‌లో జరిగిన కార్యక్రమంలో టాటా తరపున లక్ష రూపాయలను ఆ హోమ్‌కు బహూకరించారు. చివరగా హైదరాబాద్‌లోని శిల్పారామంలో జరిగిన ముగింపు వేడుకలను ఘనంగా జరిపారు.