నాటా సేవా కార్యక్రమాలకు మంచి స్పందన

నాటా సేవా కార్యక్రమాలకు మంచి స్పందన

30-12-2017

నాటా సేవా కార్యక్రమాలకు మంచి స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) ఆధ్వర్యంలో సేవాడేస్‌ను డిసెంబర్‌ 9 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతోపాటు పలువురు ప్రముఖులను కలుసుకుని అమెరికాలో 2018లో నిర్వహించే మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వానించారు. అధ్యక్షుడు రాజేశ్వర్‌ రెడ్డి గంగసాని, ప్రెసిడెంట్‌ ఎలక్ట్‌ డా. రాఘవరెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డా. శ్రీధర్‌ కొర్సపాటి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. కర్నూలు జిల్లాలోని నంద్యాలలో మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు. 12వ తేదీన చిత్తూరు జిల్లాలో రైతు సంరక్షణ రేపుతో కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు ప్రధాన కార్యక్రమాన్ని కూడా జరిపారు. నెల్లూరులో నాటా నగారా పేరుతో ఓ కార్యక్రమాన్ని జరిపారు. గద్వాల జోగుళాంబ జిల్లాలో మెడికల్‌ క్యాంప్‌ను, స్కూల్‌కు బెంచీలను బహూకరించారు. 20వ తేదీన వరంగల్‌ జిల్లాలోని జనగామలో కవిసమ్మేళనం, జానపద కార్యక్రమాన్ని నిర్వహించారు. యాదగిరిజిల్లా భువనగిరిలో మెడికల్‌ క్యాంప్‌ను ఏర్పాటు చేసి పలువురికి వైద్యపరీక్షలను జరిపారు.