లింగ న్యాయం ఇప్పటికీ ఓ పెద్ద సమస్య

లింగ న్యాయం ఇప్పటికీ ఓ పెద్ద సమస్య

30-12-2017

లింగ న్యాయం ఇప్పటికీ ఓ పెద్ద సమస్య

భారత్‌లో లింగ న్యాయం అన్నది ఇప్పటికీ ఓ పెద్ద సమస్యగానే పరిణమిస్తోందని ఐక్యరాజ్య సమితి సహాయ సెక్రటరీ జనరల్, అలాగే యుఎన్ విమెన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లక్ష్మీపురి అన్నారు. భారత ప్రభుత్వం మహిళలకు సంబంధించి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిందని, కానీ ఈ దిశగా ఆశించిన స్థాయిలో పురోగతి లేదని ఆమె తెలిపారు. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసులను తక్షణ ప్రాతిపదికన విచారించటానికి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని, ఆలాగే మహిళల విషయంలో ఏవిధంగా వ్యవహరించాలన్న దానిపైనా పోలీసులకు శిక్షణ ఇవ్వాలని ఆమె సూచించారు. లింగ సమానత్వం, లింగ న్యాయం వంటి వాటికి తమ కార్యక్రమాల్లోను, విధానాల్లోనూ ప్రాధాన్యత ఇస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని ఆమె గుర్తు చేశారు.