పాకిస్థాన్‌ కు అమెరికా షాక్‌

పాకిస్థాన్‌ కు అమెరికా షాక్‌

30-12-2017

పాకిస్థాన్‌ కు అమెరికా షాక్‌

పాకిస్థాన్‌కు ఎలాంటి ఆర్థికసాయం చేయకూడదని అమెరికా ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాక్‌లోని ఉగ్రవాద సంస్థలపై ఆ దేశం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని, అందువల్లే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సైనిక శక్తిని పెంపొందించుకునేందుకు 2002 నుంచి అమెరికా పాకిస్థాన్‌కు ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. ఇప్పటికే 33 బిలియన్‌ డాలర్లకు పైగా ఆర్థికసాయం చేసిన అమెరికా, మరో 255 మిలియన్‌ డాలర్లును ఇవ్వాలని భావించింది. అయితే గత కొంతకాలంగా ఈ రెండు దేశాల మధ్య విభేదాలు తలెత్తాయి. పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మారిందని ఆ మధ్య ట్రంప్‌ ఆరోపణలు చేశారు. అప్పటి నుంచే పాక్‌ తీరుపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంది.