వాళ్లకు 16 సార్లు న్యూ ఇయర్‌

వాళ్లకు 16 సార్లు న్యూ ఇయర్‌

30-12-2017

వాళ్లకు 16 సార్లు న్యూ ఇయర్‌

కొత్త సంవత్సర సంబురాలు ఏడాదికి ఒక్క రోజు. అదీ డిసెంబరు 31 అర్థరాత్రి చేసుకుంటాం. కానీ, ఆ వ్యోమగాములు మాత్రం 16 సార్లు కొత్త సంవత్సర వేడుకలు చేసుకోబోతున్నారు. అదేలా సాధ్యమని ఆశ్చర్యపోతున్నారా? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ప్రతీ 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టి వస్తుందన్న విషయం తెలిసిందే. అందులో ఉండే ఆరుగులు వ్యోమగాములు భూమి అంతటా తిరుగుతూ 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూస్తారన్న మాట. అంటే వీరికి 16 సార్లు కొత్త సంవత్సర సంబురాలు చేసుకునే అదృష్టం దక్కినట్లే కదా అంటోంది నాసా.