అమెరికాలో భారతీయులకు జీతాలెక్కువే!

అమెరికాలో భారతీయులకు జీతాలెక్కువే!

30-12-2017

అమెరికాలో భారతీయులకు జీతాలెక్కువే!

అమెరికాలో చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయ ఉద్యోగులకు జీతాలు ఇతర దేశాలతో పోలిస్తే అధికంగా ఉన్నాయి. ఎంత అంటే సగటు కంటే 229 రెట్లు అధికం అన్నమాట. అమెరికా ఉద్యోగుల కంటే అధికంగానే భారతీయ ఉద్యోగులు అర్జిస్తున్నారు. అమెరికాలో పేరొందిన పెద్ద కంపెనీల్లో ఒక్కో సీఈఓకు ఏడాదికి సగటున 14.3 మిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నారు. కెనడియన్‌ల కంటే రెండు రెట్లు అధికం, ఇండియా పరంగా చూస్తే 10 రెట్లు ఎక్కువ. బ్లూమ్‌బర్గ్‌ 22 దేశాల్లో సర్వే నిర్వహించగా, అమెరికాలోనే అత్యధిక జీతం ఉన్నట్టు నిర్దారించింది. నార్వే, ఆస్ట్రియాలో చాలా తక్కువ వేతనాలు ఉంటాయని బ్లూమ్‌బర్గ్‌ తెలిపింది. ఆసియాతో పోలిస్తే నార్త్‌ అమెరికా, వెస్ట్రన్‌ యూరప్‌లో నివాసం ఖర్చు అధికంగానే ఉంటుంది. తోటి ఉద్యోగుల కంటే వేతనం అనేది భారతీయులకు అధికంగా ఉంటుందని జార్జియా యూనివర్సిటీలోని విద్యనభ్యసిస్తున్న ప్రొఫెసర్‌ టిమ్‌ క్విగ్లే తెలిపారు. ఓ వ్యక్తి తలసరి ఆదాయాన్ని లెక్కించి ఆ ప్రాంతంలోని సీఈఓలకు వేతనాల కేటాయింపు ఉంటుంది.