న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం

న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం

29-12-2017

న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం

అమెరికాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నది. న్యూయార్క్‌లోని బ్రాంక్స్‌ బరోలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లో ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘుటనలో 12 మంది మృతిచెందారు. ప్రమాదంలో మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న మరో 12 మందిని అగ్నిమాపక అధికారులు రక్షించారు. 160 ఫైరింజన్లు అపార్ట్‌మెంట్‌లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మృతిచెందిన వారిలో ఏడాదిన్నర పసిపాప ఉన్నట్లు న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌ డే చెప్పారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.