చైనా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది

చైనా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది

29-12-2017

చైనా రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయింది

చైనా తీరు పట్ల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పదే పదే క్షిపణి పరీక్షలతో హడలెత్తిన్న ఉత్తర కొరియాకు ఇంధనం అమ్ముతున్న చైనాను ట్రంప్‌ తప్పుపట్టారు. చైనా వైఖరి తనను నిరుత్సాహాపరిచిందన్నారు. ఈ అంశాన్ని తన ట్విట్టర్‌ అకౌంట్‌ ద్వారా వెల్లడించారు. ఉత్తర కొరియాకు ఆయిల్‌ అమ్ముతూ రెడ్‌హ్యాండెడ్‌గా చైనా దొరికిపోయిందని ట్రంప్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. చైనా నౌకలు ఉత్తర కొరియాకు ఇంధనం సరఫరా చేస్తున్న శాటిలైట్‌ ఇమేజ్‌లు అమెరికా గుర్తించిందన్నారు. ఒకవేళ చైనా ఇలాగే వ్యవహరిస్తే, నార్త్‌ కొరియా సమస్యకు స్నేహపూర్వక పరిష్కారం దొరకదన్నారు.