అమెరికాలో గుజరాత్‌ వాసిని చంపిన దుండగులు

అమెరికాలో గుజరాత్‌ వాసిని చంపిన దుండగులు

29-12-2017

అమెరికాలో గుజరాత్‌ వాసిని చంపిన దుండగులు

అమెరికాలో మరో భారతీయుడు దారుణ హత్యకు గురయ్యాడు. చికాగోలోని డాల్టన్‌ గ్యాస్‌ స్టేషన్‌ దగ్గర దుండగులు దోపిడీకి ప్రయత్నించారు. అదే సమయంలో గ్యాస్‌ స్టేషన్‌లో ఉన్న గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల ఆర్షద్‌ వోరాపై దుండగులు తుపాకీ కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో వోరా అక్కడిక్కడే మృతి చెందగా, ఇతర కుటుంబ సభ్యులు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. గుజరాత్‌లోని నదియాద్‌ ప్రాంతం ఆర్షద్‌ వోరా స్వస్థలం.