ఒబామాకు మరో అపూర్వ గౌరవం

ఒబామాకు మరో అపూర్వ గౌరవం

29-12-2017

ఒబామాకు మరో అపూర్వ గౌరవం

అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా ఆ దేశీయుల హృదయాలను మళ్లీ గెలుచుకున్నారు. వరుసగా పదో ఏడాది అత్యంత ఆరాధ్యుడైన అమెరికన్‌ మేన్‌ గా జనం మెప్పు పొందారు. గలప్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఒబామా 17 శాతం, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 14 శాతం ఓట్లు దక్కించుకున్నారు. ఆరాధనీయ పురుషుల్లో ట్రంప్‌ రెండో స్థానంలో, పోప్‌ ఫ్రాన్సిస్‌ మూడో స్థానంలో నిలిచారు. ఇక ట్రంప్‌పై పోటీ చేసి ఓడిపోయిన హిల్లరీ క్లింటన్‌ అమెరికన్లకు అత్యంత ఆరాధనీయ మహిళగా ఎన్నికయ్యారు. ఆమెకు 9 శాతం ఓట్లు, ఒబామా సతీమణి మిషెల్‌కు 7 శాతం ఓట్లు వచ్చాయి. ట్రంప్‌ భార్య మెలానియా కేవలం ఒక శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు.