చీలికలు తెచ్చేందుకు సోషల్‌ మీడియా వాడొద్దు

చీలికలు తెచ్చేందుకు సోషల్‌ మీడియా వాడొద్దు

29-12-2017

చీలికలు తెచ్చేందుకు సోషల్‌ మీడియా వాడొద్దు

ప్రజల్లో చీలికలు తీసుకురావడానికి నేతలు సోషల్‌ మీడియాను ఉపయోగించరాదని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్‌ ఒబామా పేర్కొన్నారు. పదవి నుండి వైదొలగిన తర్వాత మొదటిసారిగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ నేరుగా ట్రంప్‌ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ తన అతిథి, బ్రిటన్‌ యువరాజు హ్యారీతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. నాయకత్వ స్థానంలో ఉన్న మనందరం ఇంటర్‌నెట్‌లో ఒక ఉమ్మడి ప్రాంతాన్ని తిరిగి సృష్టించేందుకు మార్గాలు అన్వేషించాల్సి వుందన్నారు. బిబిసి రేడియో -4 లో ప్రజాదరణ పొందిన కార్యక్రమం టుడే లో గెస్ట్‌ అతిథిగా వచ్చిన యువరాజుతో ఒబామా సంభాషించారు. ప్రజలు పూర్తి విరుద్ధమైన వాస్తవికతలను కలిగి వుండే అవకాశం, ప్రమాదం ఇంటర్‌నెట్‌కు వున్న లోపాల్లో ఒకటని ఆయన పేర్కొన్నారు. తమ పక్షపాత ధోరణులు ప్రతిబింబించేలా ప్రజలు ఇక్కడ సమచారాన్ని అల్లుతుంటారని అది సరికాదని అన్నారు.