అన్నార్తుల కోసం బోస్టన్ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన

అన్నార్తుల కోసం బోస్టన్ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన

27-12-2017

అన్నార్తుల కోసం బోస్టన్ లో నాట్స్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన

650 పౌండ్ల ఆహారాన్ని సేకరించిన నాట్స్ బోస్టన్ చాప్టర్

బోస్టన్:  ఆకలితో ఉన్న వారికి ఆ ఆకలి తీర్చడమే అత్యుత్తమ సేవగా భావించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ అమెరికా వ్యాప్తంగా ఒన్ మిలియన్ ఫుడ్ డ్రైవ్ అంటూ రంగంలోకి దిగింది. నాట్స్ ఇచ్చిన పిలుపుకు అమెరికాలో నాట్స్ విభాగాలన్నీ స్పందిస్తున్నాయి. తాజాగా బొస్టన్ లోని నాట్స్ చాప్టర్ చేపట్టిన నాట్స్ ఒన్ మిలియన్ క్యాన్ ఫుడ్ డ్రైవ్ కు విశేష స్పందన లభించింది. నాట్స్ సభ్యులతో పాటు స్థానికంగా ఉండే తెలుగువారంతా పేదలకు అందించే ఫుడ్ క్యాన్స్ సేకరించడంలో తమ వంతు సాయం అందించారు. నాట్స్ బోస్టన్ టీం  మొత్తం 864 పౌండ్ల ఆహారాన్ని సేకరించింది. దీని ద్వారా దాదాపు 650 మందికి భోజనాన్ని అందించే వీలుంది.

ఈ ఆహారాన్ని స్థానికంగా ఉండే మేర్రిమక్ వ్యాలీ ఫుడ్ బ్యాంక్ కు అందించడం జరిగింది. పేదల ఆకలితీర్చడానికి మేర్రిమక్ వ్యాలీ పనిచేస్తుంది. అందుకే నాట్స్ బోస్టన్ చాప్టర్ తాము సేకరించిన ఆహారాన్ని మేర్రిమక్ వ్యాలీ ఫుడ్ బ్యాంక్ కు అందించింది. పవన్ వేమూరి నాయకత్వంలో నాట్స్ బోస్టన్ చాప్టర్ ఈ ఫుడ్ డ్రైవ్ చేపట్టింది.గౌతం చుండూరు, కల్యాణ్ కాకి, ప్రసాద్ లక్కాల, రాఘవ నన్నూరి, రాజేశ్ పాటిబండ్ల, శ్రీధర్ గోరంట్ల, శ్రీనివాస్ గొండి, సునీల్ కంభపాటి, సునీల్ కొల్లి తదితరులు నాట్స్ బోస్టన్ చాప్టర్ లో ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడానికి కృషి చేశారు.

Click here for Photogallery