పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు

పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు

27-12-2017

పీచు పదార్థాలు ఆరోగ్యానికి మేలు

బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు ఆహార నియమావళి పాటిస్తుంటాం. అయితే, ఎంత ఆహారం తీసుకున్నామనేదానికంటే, ఆ ఆహారంలో పీచు శాతం ఎంత ఉందనేదే ముఖ్యమని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఎందుకంటే, పేగులో ఉండే బ్యాక్టీరియా పీచు పదార్థాలను ఎప్పుడు తిందామా అని సిద్ధంగా ఉంటుందని, ఆహారంలో పీచు ఎక్కువగా ఉంటే తిన్న ఆహారం తొందరగా జీర్ణం అవుతుందని అమెరికాలోని జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు తెలిపారు. పీచు పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల పెద్దపేగు ఆరోగ్యంగా, రక్తంలో చక్కెర శాతం, బరువు అదుపులో ఉంటాయని వివరించారు.