హెచ్‌1బీ మళ్లీ మరింత కఠినతరం

హెచ్‌1బీ మళ్లీ మరింత కఠినతరం

26-12-2017

హెచ్‌1బీ మళ్లీ మరింత కఠినతరం

ఉద్యోగ రీత్యా అమెరికాకు వచ్చేవారికి జారీ చేసే హెచ్‌1బీ వీసాలను ఆ దేశం మరింత కఠినతరం చేయనుంది. తాజా నిబంధనలకు సంబంధించిన ప్రతిపాదనలను అమెరికా దేశీయ భద్రతా విభాగం రూపొందిస్తున్నట్లు తెలిసింది. 2011 నాటి ఓ ప్రతిపాదనను మళ్లీ తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం ఈ వీసాల కోసం దరఖాస్తు చేయాలనుకున్న వారు తొలుత లాటరీ ద్వారా ఎంపికవ్వటానికి విధించిన పరిమితి పరిధిలోని ఉన్నారని నిర్ధరించే సంఖ్యను పొందాల్సి ఉంటుంది. అలా ఎంపికయ్యే దరఖస్తుల్లోనూ అత్యధిక వేతనాలు, అత్యధిక నైపుణ్యాలు ఉన్నవారికే ప్రాధాన్యం ఇవ్వనున్నారని సమాచారం. ఉద్యోగాల్లో అమెరికన్లకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్‌ విధానాలను అనుగుణంగా నిబంధనలను కఠినతరం చేస్తున్నారు.