అమెరికాది పగటి కలే

అమెరికాది పగటి కలే

26-12-2017

అమెరికాది పగటి కలే

తాము అణ్వస్త్రాలను పక్కన పెట్టేస్తామని అమెరికా అనుకోవడం పగటి కలే అవుతుందని ఉత్తర కొరియా వ్యాఖ్యానించింది. ఐరాస కొత్త ఆంక్షలను యుద్ధ చర్యలుగా అభివర్ణించింది. అమెరికాలోని మూలమూలనూ తాకే బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన అనంతరం ఉత్తర కొరియాపై ఇటీవల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. వీటిపై ఆ దేశ విదేశాంగ శాఖ స్పందించింది. ఈ ఆంక్షలు తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తున్నాయని వ్యాఖ్యానించింది.