అభివృద్ధి సాధిస్తున్నాం... శాంతి కావాలి : ట్రంప్‌

అభివృద్ధి సాధిస్తున్నాం... శాంతి కావాలి : ట్రంప్‌

26-12-2017

అభివృద్ధి సాధిస్తున్నాం... శాంతి కావాలి :  ట్రంప్‌

అభివృద్ధి బాటలో పయనిస్తున్న అమెరికాకు శాంతిని ప్రసాదించాలని తాను దైవాన్ని కోరుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. క్రిస్మస్‌ రోజున దేశ ప్రజలకు శుభాకాంక్షలు చెబుతూ తన మనసులోని మాటను పంచుకున్నారు. దైవ ప్రతినిధిగా ప్రజల కోర్కెలు తీర్చేందుకు వస్తున్న శాంతాక్లజ్‌ను అమెరికాకు శాంతిని ప్రసాదించాల్సిందిగా కోరాలని ఆయన బాలలకు పిలుపునిచ్చారు. నార్త్‌ అమెరికన్‌ ఎయిరోస్పేస్‌ డిఫెన్స్‌ కమాండ్‌ (నోరాడ్‌)ను సందర్శించిన ఆయన అక్కడి చిన్నారులనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏటా నోరాడ్‌ ప్రాంతంలో క్రిస్మస్‌ వేడుకలను ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. ఈ సందర్భంగా ఆర్నేట్‌లో జరిగిన కార్యక్రమంలో తన భార్య మెలానియతో కలిసి పాల్గొన్న ట్రంప్‌ అక్కడికి చేరుకున్న చిన్నారులు, యువత, వారి తల్లిదండ్రులను పలకరించారు.