'తానా' నవలల పోటీ 2017 బహుమతి ప్రదానం-నవలల ఆవిష్కరణ

'తానా' నవలల పోటీ 2017 బహుమతి ప్రదానం-నవలల ఆవిష్కరణ

25-12-2017

'తానా' నవలల పోటీ 2017 బహుమతి ప్రదానం-నవలల ఆవిష్కరణ

తానా నవలల పోటి నవలల బహుమతి ప్రదానం నవలల ఆవిష్కరణ ఈరోజు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. కె.ఎన్.మల్లీశ్వరి గారి' నీల' నవల, బండి నారాయణస్వామి 'శప్తభూమి', సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి ' ఒంటరి' నవల ఈసారి తానా వారి నవలల పురస్కారాన్నందుకున్నాయి. డా.సి.మృణాళిని, శ్రీ ఆడెపు లక్ష్మీపతిలు న్యాయనిర్ణేతలు. మొత్తం 55 నవలలు పోటీకి ఎంట్రీలుగా వచ్చాయని కన్వీనర్  వాసిరెడ్డి నవీన్ సభకు ఆహ్వానం పలికుతూ తెలియచేశారు. కవి శివారెడ్డి సభాధ్యక్షులు. అంపశయ్య నవీన్ ఆవిష్కర్త. సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీతకు. వీరభద్రయ్యళమ ముఖ్య అతిథి. ప్రముఖ రచయితలెందరో పాల్గొన్న విశిష్ట సభ.

అధ్యక్షోపన్యాసంచేస్తూ కవి శివారెడ్డి మాట్లాడుతూ నవలా ప్రక్రియలో తెలుగు భాష మిగిలిన భాషా సాహిత్యాల పోటీలో వెనకపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యతరగతి మీద సంతృప్తికర నవల రాలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. బహుమతి పొందిన ముగ్గురు రచయితలు సమర్థులైనవారే.

ఆవిష్కరణ కర్త అంపశయ్య నవీన్ మాట్లాడుతూ' ఈ మూడునవలలని ఆవిష్కరించే అవకాశం సంతోషాన్నిస్తోంది. మంచి నవలలు రాలేదన్న అభిప్రాయం తో ఏకీభవించను కానీ డి.హెచ్.లారెన్స్.మాట చెబుతాను. నవలాకారుడు అందరికన్నాగొప్పవాడంటాడు అతను. నవలలో కవిత్వం వ్యాసం కవిత్వం ఫిలాసఫీ అన్నీ ఉంటాయి. కవిత్వం మీద వచనం చేసిన తిరుగుబాటు నవల అంటాడు వల్లంపాటి వెంకట సుబ్బయ్య.వేలమంది పాఠకులు తమను తాము చూసుకునే ప్రక్రియ నవల.

తానా ప్రచురణల కమిటీ అధ్యక్షులు కన్నెగంటి చంద్ర మాట్లాడుతూ 'సాహిత్యం మీద మక్కువతో చేస్తున్న తానా చేస్తున్న పని ఇది. జంపాల చౌదరిగారు ఈ కమిటీ పూర్వ అధ్యక్షులుగా ఎంతో కృషి చేశారు నవలల పోటీకీ 55 నవలలు వచ్చాయి. మూడు నవలలు విభిన్నంగా నిలిచేవే. పోటీ అంటే పాఠకులకు ఆసక్తి ఉంటుందన మంచి నవలలు వస్తాయని ఆశించాం. మా నమ్మకం సరైనదే అని రచయితలు నిరూపించారు' అన్నారు.

సప్తభూమి నవల రాసిన బండి నారాయణ స్వామిని 'నీల 'నవల రచయిత్రి కె.ఎన్.మల్లీశ్వరిని, 'ఒంటరి ' నవల రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డిని వాసిరెడ్డి నవీన్ పరిచయం సభకు చేశారు.

కన్నడ రచయిత సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత కు.వీరభద్రం మాట్లాడుతూ ఈసభలో ముఖ్యఅతిథిగా పాల్గొనటమో అదృష్టం. ప్రపంచంలో ఉన్న సాహిత్య వేత్తలలో రెండు వర్గాలుంటాయి. పాలకవర్గాలను ప్రశ్నించే సాహితీవేత్తలు నాకిష్టం. జనరంజకంగా రాసే రచయితలు సుఖంగా ఉంటారు. ప్రజల పక్షం రాసేవారు అశాంతితో ఉంటారు. రచయిత ఎవరి పక్షం వహించి రాస్తున్నాడనేది ముఖ్యం. దీనికి ఒయన అనేక ఉదాహరణలను కోట్ చేసి చెప్పటం సభికులను ఆశ్చర్యపరచారు. వామపక్షవాద రచయితలకు బాధ్యత పెరిగింది అని నాకనిపిస్తోంది అంటూ రచయిత అన్నవాడు రాజ్యవ్యవస్థకన్నా సామాజిక వ్యవస్థ గొప్పదని గుర్తించాలి అన్నారు.

రచయిత్రి చంద్రలత గారు మాట్లాడుతూ ' ఇరవై ఏళ్ళకితం నా నవలకు పురస్కారం వచ్చినప్పుడు నాకు ఇరవై ఆరేళ్ళు.నా రేగడివిత్తులు గురించి ఒక పెద్దమనిషి ప్రశ్నించారు. తర్వాత మిత్రుడయ్యారు. ఆయన పారణ లక్ష్మీ నరసింహం నవలకు కొంచెం అమాయకత్వం ఉండాలనిపిస్తుంది. నవల జీవితాన్ని చూపిస్తుంది. జీవితంలోని ఖాళీలే నవలలో ఉంటాయి. నవలలో అదెందుకు రాయలేదు ఇదెందుకు రాయలేదు అన్నది కరెక్ట్ కాదు. అదొక ఓపెన్ టెక్స్ట్ గా భావించి చదవాలి. సాహిత్యం పై తానా వాళ్ళు చేస్తున్న కృషి అభినందనీయం అని తానా సభ్యులను అభినందించారు.

'శప్తభూమి' నవలను పరిచయం చేస్తూ డా.సి.మృణాళిని మాట్లాడుతూ ' ఆడెపు లక్ష్మీ పతి గారూ నేనూ ఒకే నవలలను ఎంపిక చేశాం.ఈ మూడు నవలలోనూ అధ్యయనం ఉంది, పరిశోధన ఉంది. అనంతపురం చరిత్రను దళిత బహుజనుల గురించి వాళ్ళ కోణం ద్వారా చెప్పిన నవల శప్తభూమి. చారిత్రక పాత్రలను రచయిత కల్పించారు.ఇదొక archtype cultural novel.కరువుకు సంబంధించి ప్రశ్నలు రచయిత వేయటం, సంస్కృతి పరంగా చూపే అంశాలు ఈ నవలలో కనిపిస్తాయి. ఉదాత్తమైన స్త్రీ పాత్రలు, కొన్ని వైరుధ్యాలను చిత్రిస్తారు నారాయణస్వామి. సాంస్కృతిక జీవనపునాదుల్ని, సజీవత్వాన్ని రచయిత పట్టుకోవడమో విశేషం. నవల పూర్తయ్యేసరికి సుడులు తిరిగే బాధను పాఠకుడు అనుభవిస్తాడు. పాత్రలు పడ్డ హింసను వేదనను చూస్తాం. శిల్పపరంగా వచ్చిన గొప్పనవల. ఆనాటికీ ఈనాటికీ శపింపబడ్డ భూమిగా అనంతపురం ప్రాంతం ఎందుకయిందో తెలుస్తుంది.

'నీల' నవల గురించి ఆడెపు లక్ష్మీపతి మాట్లాడుతూ ' ఈ నవలల పోటీలో ఏ నవల ఉత్తమమయింది అని న్యాయనిర్ణయం చేయటం అనేది కొంచెం కష్టమే. నిర్ణయం తీసుకునేప్పుడు తర్జన భర్జనలుంటాయి. తానా వారు నాకు16 నవలలు పంపారు. తెలుగు వారి జీవనాన్ని క్లాసిక్ గా చిత్రించాలన్నది వారి తాపత్రయం.
1 కథావస్తువు సమకాలీనత
2 సాహిత్య సాంప్రదాయక విలువలు
3 ప్లాట్
4 శిల్పం..ఇంకా మరికొన్ని అంశాలున్నాయి.
నీల నవలలోని ముఖ్య పాత్ర పొందిన మానసిక పరిస్థితి ఎదిగిన క్రమం, దళిత కుటుంబ నేపథ్యం. జీవితంలో ఎదురయ్యే ఒడుదుడుకులు. ఆంక్షలు. కష్టాలనుదాటి ఎదిగే క్రమంలో జీవితంలో ఎలా స్థిరపడింది అన్నది కథ.పెద్ద కేన్వాస్ కలిగింది. పాత్రలతోపాటు ఉద్యమాలు ఎన్నో ఉన్నాయి. దళిత స్త్రీ జీవిత నేపథ్యం నుంచి మానవ సంబంధాలను చూసే నవల. వ్యక్తి గత స్వేచ్ఛను ఆనందించాలనే స్త్రీ వాద కోణమున్నది. వర్ణనాత్మకశైలి పాఠకులను ఆకట్టుకుంది. Narrator alter ego పాత్ర రచయిత్రి ఏం చెప్పదలచుకుందో చెబుతుంది అన్నారు ఆడెపు లక్ష్మీపతి. సారా వ్యతిరేక ఉద్యమంతో మొదలుపెట్టి అనేక ఉద్యమాల ప్రస్తావన ఉంటుంది. తెలుగులో ఇటీవల కాలంలో వచ్చిన నవలలను పరిశీలించే అవకాశం కలిగింది ఈ నవలల పోటీద్వారా అన్నారు ఆడెపు లక్ష్మీ పతి.

సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి నవల ఒంటరి నవలను పరిచయం చేస్తూ శ్రీ గొర్తిబ్రహ్మానందం 'నవల రాయటానికి నేర్పు ఓర్పు కావాలి. ఈ నవల ప్రత్యేకత ప్రకృతి నవలలో ప్రధానపాత్ర కావటం.నల్లమల్ల అడవుల్లో అరికె బియ్యం కోసం ముఖ్యపాత్ర చేసిన సుదీర్ఘ ప్రయాణం ఈనవల 'ఒంటరి'. పల్లె కి పట్నవాసానికి సాంకేతిక వారధి ఉండాలని రచయిత ఆశిస్తాడు.ఈ మూడునవలల ను మూడుసార్లు చదివాం నేనూ కన్నెగంటి రామారావు, జంపాల చౌదరి.. అనంతరం రచయితలు తమ స్పందనలన తెలలియచేశారు.
తమ స్పందనలో బండి నారాయణస్వామి మాట్లాడుతూ ' సాహిత్యంలో ఉండే ఉబలాటం ఈవయసులో ఇప్పుడు లేదు. నవలను రాయించిన శక్తులేమిటి అన్న ప్రశ్న వేసుకుంటే జీవితం ఒక మూసను కర్కశంగా ప్రసాదిస్తుంది.సాహిత్యం కూడా దాంట్లో భాగమే. ఇరవై ఇదేళ్ళ వాడికుండే ఫ్రెష్ నెస్ నాలోలేదు. వస్తుపరంగా మూసలో కొట్టుకుపోతున్నాం. దాన్ని బద్దలుకొట్టలేమా అన్న ప్రశ్న వేసుకున్నాను. రాయలసీమ కరువుగురించి దుర్భిక్షం గురించి కొత్తగా ఎలా చెబుతామన్న ప్రశ్నతో మూసను బద్ధలు కొట్టాలన్న రాసిన నవల ఇది.

కె.ఎన్.మల్లీశ్వరి మాట్లాడుతూ' ఒక ప్రాసెస్ ను చెప్పే క్రమంలో ఒక ఒత్తడి కథ సరిపోకపోవటం వలన నవలను ఎంచుకున్నాను.ఉద్యమాల నేపథ్యంలో స్త్రీ పురుష సంబంధాలను అర్థం చేసుకోవడానికి చేసిన ప్రయత్నమిది. మా నాన్నగారు స్వేచ్ఛగా ఆలోచించటం మాకు నేర్పారు అని వారి చేతులమీదుగా ప్రతిని అందుకున్నారు
2011 లో ఈనవల రాయటం మొదలుపెట్టి 2017లో ముగించాను. తానా వారు బహుమతిచ్చి ప్రచురించటం ఆనందంగా ఉందని ముగించారు. నవలను చదివి నాకు ధైర్యాన్నిచ్చిన కె.శ్రీనివాస్ దంపతులకు కృతజ్ఞతలు అన్నారు.

'ఒంటరి 'నవల రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ ' ఇది తన జీవిత కాలపు వేదనగా ఈనవలను పేర్కొన్నారు. అడవులను కొట్టేసి భీభత్సాన్ని సృష్టించిన నయావలసవాదులను చూసినప్పుడు కలిగినవేదన. మా ప్రాంతంలో నా కుంటల్ని బీడుభూములుగా ఉంచాను.నేన ప్రకృతిలో చేసిన ప్రయాణమే ఈనవల.

రచయితల స్పందన అనంతరం కవి శివారెడ్డి మాట్లాడుతూ ' సుదీర్ఘంగా జీవితాంతం చేసే ప్రాసెస్ నుంచి వచ్చే సృజన గొప్పదని నా అభిప్రాయం. కొత్త రచయితలు రావాలని కోరుతున్నా అన్నారు.

చివరిగా కథాసాహిత్యం తరఫున తమకృతజ్ఞతలు తెలియచేశారు వాసిరెడ్డి నవీన్.

- Sita Rambabu Chennuri


Click here for Photogallery