ఆస్టిన్‌లో ఘనంగా వైఎస్ జగన్‌ జన్మదిన వేడుకలు

ఆస్టిన్‌లో ఘనంగా వైఎస్ జగన్‌ జన్మదిన వేడుకలు

24-12-2017

ఆస్టిన్‌లో ఘనంగా వైఎస్ జగన్‌ జన్మదిన వేడుకలు

వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలోని ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో ఆస్టిన్ లోని స్పైస్ రెస్టారెంట్ లో జరిగిన వేడుకలలో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి చింతగుంట, రవి బల్లాడ, పుల్లారెడ్డి ఏడురు, మల్లికార్జున రెడ్డి ఆవుల, నారాయణ రెడ్డి గండ్ర, రామ్ గొంగినేని, శివ ఎర్రగుడి, ప్రవర్ధన్ చిమ్ముల, వెంకట్రామ్ రెడ్డి ఉమ్మ, బ్రహ్మేంద్ర లక్కు, రామ హనుమంత, మల్లి రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డిగారి, పరమేశ్వర రెడ్డి నంగి, చెంగల్ రెడ్డి ఎర్రదొడ్డి, కొండా రెడ్డి ద్వరసాల, ప్రదీప్ లక్కిరెడ్డి, అనంత్ బోయపల్లె, బద్రి ఎల్ఎం, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.