అప్ఘనిస్థాన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు

అప్ఘనిస్థాన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు

23-12-2017

అప్ఘనిస్థాన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ అఫ్ఘనిస్తాన్‌లో పర్యటించారు. విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం అప్ఘనిస్థాన్‌ అధ్యక్ష కార్యాలయానికి చేరుకున్నారు. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అబ్దులా అబ్దుల్లాలతో సమావేశమయ్యారు. ఆఫ్ఘాన్‌లో ఉగ్రసంస్థలను కట్టడిచేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని అన్నారు. ఉగ్రసంస్థల అణచివేత కోసం ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని అన్నారు. అనంతరం బాగ్రామ్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ఈ స్థావరంలో ఆఫ్ఘాన్‌ సైనికులకు శిక్షణ ఇస్తున్న అమెరికా సైనికులతో ఆయన భేటీ అయ్యారు. ఉగ్రసంస్థల ఏరివేత కోసం నిర్వహిస్తున్న ఆపరేషన్‌ గురించి అడిగి తెలుసుకున్నారు.