అమెరికాలో పెరుగుతున్న స్థానిక ఉద్యోగులు

అమెరికాలో పెరుగుతున్న స్థానిక ఉద్యోగులు

23-12-2017

అమెరికాలో పెరుగుతున్న స్థానిక ఉద్యోగులు

అన్నింటిలో అమెరికా ఫస్టు అన్న నినాదంతో అనూహ్యంగా దూసుకు వచ్చి ఘనవిజయం సాధించి తనదైన రీతిలో అమెరికాను పరుగులెత్తిస్తున్న అధ్యక్షుడు ట్రంప్‌ కలలు ఒకటొకటే నిజమవుతున్నాయి. ఏడు ముస్లిం దేశాలపై వలసలను, పర్యాటకులను నిషేధించి ప్రపంచ వ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొన్న ట్రంప్‌ మెండి పట్టును వీడకుండా తన నిర్ణయాలను కోర్టులలో, అమెరికా పార్లమెంటు(కాంగ్రెస్‌)లోనూ నెగ్గించుకుంటూ జోరుమీదున్నారు. వీసా నిబంధనలను కఠినతరం చేసి భారత్‌, చైనాలతో బాటు ఆసియా దేశాల వలసలకు అడ్డుకట్టవేసారు. భారత్‌ నుండి అమెరికాకు వెళ్ళే వారి సంఖ్య గత ఏడాదిగా సగానికి పైగా పడిపోయింది. ఇప్పుడు తాజాగా ట్రంప్‌ నిర్ణయాల వల్ల స్థానికులకు ఉద్యోగాలు దొరుకుతున్నాయని, 19 రాష్ట్రాలలో నిరుద్యోగుల శాతం భారీగా తగ్గగా, 27 రాష్ట్రాలలో గత ఏడాది కాలంగా పేరోల్‌(శాశ్వత ఉద్యోగాల)  ఉద్యోగుల సంఖ్య భారీగా ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పెరిగిందని ట్రంప్‌ అధికారులు లెక్కలు చెబుతున్నారు. టెక్సాస్‌లో 3 లక్షలకు పైగా, కాలిఫోర్నియాలో 2.8 లక్షల ఉద్యోగాల స్థానికులు సొంతం చేసుకున్నారు. అయితే స్థానిక నిరుద్యోగుల శాతం తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాలలో 2 నుండి 4 శాతం ఉందని, నిబంధనలను మరింత కఠినతరం చేస్తే మరింత ఫలితం ఉంటుందని ట్రంప్‌ అధికారులు తెలిపారు.