హైదరాబాద్‌లో ఆటా బిజినెస్‌ సదస్సు జయప్రదం

హైదరాబాద్‌లో ఆటా బిజినెస్‌ సదస్సు జయప్రదం

23-12-2017

హైదరాబాద్‌లో ఆటా బిజినెస్‌ సదస్సు జయప్రదం

అమెరికా తెలుగు సంఘం (ఆటా) నిర్వహించిన బిజినెస్‌ సదస్సు విజయవంతమైంది. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటా హైదరాబాద్‌లోని టీ - హబ్‌లో శుక్రవారంనాడు బిజినెస్‌ సెమినార్‌ను ఏర్పాటు చేసింది. ఈ సెమినార్‌కు పలువురు ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిధులను సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌ అసిరెడ్డి ఆహ్వానించారు. ఆటా తరపున చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. సెమినార్‌లో అమెరికాలో ఉన్న అవకాశాలపై, వీసా విధానాలపై సమగ్రంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆటా తదుపరి అధ్యక్షుడు పరమేశ్‌ భీమ్‌రెడ్డి, భువనేష్‌ భుజాల, అనిల్‌, వేణుగోపాలరావు సంకినేని, సౌమ్య కొండపల్లి తదితరులు పాల్గొన్నారు.