డిసెంబర్ 24న ప్రవాసి తెలంగాణ దివస్‌

డిసెంబర్ 24న ప్రవాసి తెలంగాణ దివస్‌

22-12-2017

డిసెంబర్ 24న ప్రవాసి తెలంగాణ దివస్‌

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం-యూఎస్‌ఏ ఆధ్వర్యంలో డిసెంబర్ 24న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు రవీంద్రభారతిలో ఐదో ప్రవాసీ తెలంగాణ దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీడీఎఫ్‌ వ్యవస్థాపకులు మధు కె.రెడ్డి తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఇండియా, యూఎస్‌ఏ అధ్యక్షులు డీపీ రెడ్డి, లక్ష్మణ్‌ అనుగు, మాజీ అధ్యక్షుడు మురళీ, భారత ఉపాధ్యక్షుడు రాజారెడ్డి, ప్రతినిధులు భవాని, రాము పాల్గొన్నారు.