ట్రంప్ తో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు

ట్రంప్ తో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు

13-03-2017

ట్రంప్ తో మాట్లాడేందుకు ఆయన ఇష్టపడలేదు

అటార్నీ ప్రీత్‌ భారారను తొలగించడానికి రెండు రోజుల ముందు ఆయనతో మాట్లాడేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రయత్నించినట్లు శ్వేతసౌధ అధికార వర్గాలు తెలిపాయి. ఆయన సేవలకు కృతజ్ఞతలు తెలిపేందుకు, ఆయనకు మంచి భవిష్యత్తు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపేందుకు ట్రంప్‌ ప్రయత్నించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ భారార ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ట్రంప్‌తో మాట్లాడేందుకు ఇష్టపడలేదని పేర్కొన్నారు. కానీ ప్రీత్‌ భారార వాదన మరోరకంగా ఉంది. నవంబర్‌లో ్ట ట్రంప్‌ను కలిసినప్పుడు అటార్నీ పదవిలో కొనసాగేందుకు అంగీకరించారని చెబుతున్నారు. కానీ తర్వాత రాజీనామా చేసేందుకు నిరాకరించడంతో తొలగించారని ఆయన తెలిపారు.  భారార ఈ పదవిలో ఉండి పలు కీలక కేసులను వాదించారు. సదరన్‌ డిస్ట్రిక్‌ ఆఫ్‌ న్యూయార్క్‌, మాన్‌హట్టన్‌లకు ఆయన అటార్నీగా వ్యవహరించారు. ఈ సమయంలో ఆర్థిక నేరాల కేసులు, వైట్‌కాలర్‌ నేరాలు, ఉగ్రవాద అనుమానితులు వంటి కేసులు డీల్‌ చేశారు.