భారతీయురాలికి బంగారు కత్తెర

భారతీయురాలికి బంగారు కత్తెర

16-12-2017

భారతీయురాలికి బంగారు కత్తెర

అమెరికాలో కాలంచెల్లిన నియంత్రణల రద్దులో కీలక పాత్ర పోషించిన ఇండో-అమెరికన్‌ సయోమి జహంగీర్‌ రావ్‌కు తగిన గుర్తింపు లభించింది. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్‌ బంగారు కత్తెరను ఆమెకు బహుకరించారు. 1960ల నాటి, ప్రస్తుత నియంత్రణలను కలిగిన ప్రతులను చుట్టిన రెడ్‌ టేప్‌ (కఠిన నియంత్రణలకు సూచిక)ను ట్రంప్‌ ఈ కత్తెరతోనే కత్తిరించి రావ్‌కు అందించారు. 2017 జూలై 18 నుంచి శ్వేతసౌధ సమాచారం, నియంత్రణా వ్యవహారాల హెడ్‌గా వ్యవహరిస్తున్న రావ్‌ పాత నిబంధనలు, నియంత్రణల తొలగింపునకు కృషి చేశారు. ట్రంప్‌ ప్రతి కొత్త నియంత్రణకు 22 పాత వాటిని ఎత్తి వేశారు. సంస్కరణలతో సుమారు రూ.51925 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు.