భారత్ అమెరికా మధ్య హెచ్1బీ వివాదం
Sailaja Reddy Alluddu

భారత్ అమెరికా మధ్య హెచ్1బీ వివాదం

13-03-2017

భారత్ అమెరికా మధ్య హెచ్1బీ వివాదం

భారత్‌ అమెరికాల మధ్య వివాదానికి హెచ్‌1బీ వీసాలే కారణం కావచ్చని మాజీ అమెరికన్‌ రాయబారి అభిప్రాయపడ్డారు. లక్షల మంది భారతీయులకు ఉపాధి అయిన ఈ అంశంపై అర్థవంతమైన చర్చ జరగాలని అమెరికా మాజీ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ ఫర్‌ సౌత్‌ అండ్‌ సెంట్రల్‌ ఏసియా నిషా దేశాయ్‌ బిస్వాల్‌ అభిప్రాయపడ్డారు. హెచ్‌1బీ వీసా నిబంధనలను కఠినతరం చేస్తూ అమెరికాలో దాదాపు అరడజను బిల్లులు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. హెచ్‌1బీ వీసా విధానం భారత్‌ అమెరికాలకు ముఖ్యమైన అంశం అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది ఇరుపక్షాలకు ఉపయోగపడుతుందని అన్నారు. అమెరికా కంపెనీలకు ప్రతిభావంతుల కొరత ఏర్పడినప్పుడు ఇది ఉపయోగపడిందని అభిప్రాయపడ్డారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఎంతో ప్రయోజనకరంగా ఉందన్నారు. కాకపోతే కొంత తప్పుదోవ పట్టిన విషయాన్ని అంగీకరించాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిపోయి మరింత జఠిలం చేస్తున్నారని అన్నారు. అవసరాలకు తగినట్లు అమెరికన్లను సిద్ధం చేయడం, వారికి శిక్షణ,  పనితీరులో మార్పులు ఇతర అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. ప్రస్తుతం హెచ్‌1బీ వీసాల్లో మార్పులతో ప్రతిభను స్వాగతించలేకపోవచ్చు. అయితే ఆర్థిక వ్యవస్థ దూకుడు తగ్గుతుందని అని అభిప్రాయపడ్డారు.