డొనాల్డ్‌ ట్రంప్‌ టీమ్‌కు షాక్‌

డొనాల్డ్‌ ట్రంప్‌ టీమ్‌కు షాక్‌

13-12-2017

డొనాల్డ్‌ ట్రంప్‌ టీమ్‌కు షాక్‌

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టీమ్‌కు ఇది ఊహించని షాక్‌. ఆయన ప్రతిపాదించిన అభ్యర్థి కీలకమైన ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అలబామా సేనేట్‌ రేసులో డెమోక్రటిక్‌ అభ్యర్థి డగ్‌ జోన్స్‌ గెలుపొందారు. అలబామా సేనేట్‌ (ఎగువసభ) సీటు 25 ఏళ్ల తర్వాత  మళ్లీ డెమోక్రటిక్‌ పార్టీకి దక్కింది. హోరాహోరీగా సాగిన రేసులో రాయ్‌ మూర్‌ అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. మూర్‌ తరపున ప్రెసిడెంట్‌ డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రచారం నిర్వహించారు. కానీ ట్రంప్‌ వాగ్ధానాలు ఆయన పార్టీకి విక్టరీ దక్కించలేకపోయాయి. ఈ ఓటమితో సేనేట్‌లో రిపబ్లికన్ల  మెజారిటీ 51-49 సీట్లుకు తగ్గింది. టీనేజ్‌ అమ్మాయిలను లైంగికంగా వేధించారని మూర్‌పై ఇటీవల ఆరోపణలు వచ్చాయి. అయినా కానీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ప్రచారంలో మూర్‌నే బలపరిచాడు. కానీ ఓటర్లు మాత్రం మూర్‌కు చెక్‌ చెప్పారు. సేనేట్‌ రేసులో నెగ్గిన డగ్‌ జోన్స్‌కు అధ్యక్షుడు ట్రంప్‌ శుభాకాంక్షలు తెలిపారు.